ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

by srinivas |   ( Updated:2020-06-13 11:37:02.0  )
ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. 17 మంది ఐపీఎస్ అధికారుల బదిలీల జాబితాను ప్రభుత్వం ముందే సిద్ధం చేసుకుంది. ఈ జాబితా ప్రకారం ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలందిస్తున్న ద్వారకా తిరుమల రావును రైల్వేస్ డీజీపీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో బి. శ్రీనివాసులు నియమించింది.

బదిలీల వివరాలను పరిశీలిస్తే.. రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించగా, విజయవాడ సీపీగా బి.శ్రీనివాసులు, ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం, రోడ్‌సేఫ్టీ అడిషనల్ డీజీపీగా కృపానంద త్రిపాటి ఉజేలా, ఎస్‌ఈబీ డైరెక్టర్‌గా పిహెచ్‌డీ రామక్రిష్ణ, గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్, డీజీపీ కార్యాలయం(అడ్మిన్) ఏఐజీగా ఉదయ్ భాస్కర్, విశాఖ డీసీపీ 1గా ఐశ్వర్య రస్తోగి, ఎస్‌ఐబీ ఎస్పీగా బాబూజీ అట్టాడ, విశాఖ రూరల్ ఎస్పీగా బి.కృష్ణారావు , విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సీహెచ్ విజయారావు, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా కె.నారాయణ నాయక్, సీఐడీ ఎస్పీగా గ్రేవల్ నవదీప్ సింగ్, గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్నీ, మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్‌గా ఎం.దీపికలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఐపీఎస్ అధికారి ఎస్‌.రంగారెడ్డిని హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed