సీఎం జగన్ కీలక నిర్ణయం.. రూ. 8 వేల కోట్లతో..

by Anukaran |   ( Updated:2021-05-31 01:31:20.0  )
సీఎం జగన్ కీలక నిర్ణయం.. రూ. 8 వేల కోట్లతో..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుకొండ, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా అందుబాటులో తీసుకొస్తామని.. 500 పడకలతో కూడిన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రూ. 8 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని.. 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే పాడేరు, పులివెందులలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. పేదవాడికి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నామని.. నాడు నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో టీచింగ్, నర్సింగ్ కళాశాలలు, ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి గ్రామంలో వైఎస్సార్ క్లీనిక్‌లు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed