పెళ్లి బహుమానం.. 16మందికి కరోనా

by Aamani |
పెళ్లి బహుమానం.. 16మందికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లి కొచ్చిన బంధువులకు బహుమతులు ప్రదానం చేయడం చూసుంటాం. కానీ, ఈ పెళ్లికి వచ్చిన వారికి గిఫ్టు కింద కరోనా వైరస్‌ను అంటించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు.ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. గతవారం కిందట ధర్మపురి అమ్మాయికి, మంచిర్యాల అబ్బాయితో వివాహం జరిగింది. అయితే, ఆ శుభకార్యానికి హాజరై ఇంటికి వెళ్లిన వారంతా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. అనుమానం వచ్చి వారందరికీ ఈరోజు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో 16మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ధర్మపురిలో జరిగిన వివాహానికి వచ్చిన బంధువుల లిస్ట్, కరోనా బాధితుల ప్రైమరీ కాంటాక్ట్‌ను ఛేదించేందుకు రంగం సిద్ధంచేశారు. ఈ వార్త తెలుసుకున్న పెళ్లివారు సైతం భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story