తెలంగాణలో కరోనా కొత్త కేసులు ఎన్నంటే?

by Anukaran |
తెలంగాణలో కరోనా కొత్త కేసులు ఎన్నంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఎంతకట్టడి చేసినా కేసులు విపరీతంగా పెరుగుతూ.. ప్రజలను తీవ్ర భయబ్రాంతులను గురిచేస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,554 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,19,224 కు చేరింది. కొత్తగా వైరస్ బారినపడి ఏడుగురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,256కు పెరిగింది. తాజాగా 1,435 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,94,653 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో43,916 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 37,46,963 కు చేరింది.

Advertisement

Next Story