- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమన్నా.. 15 ఏళ్ల ‘మిల్కీ’ షేక్!
దిశ, వెబ్‌డెస్క్: అందానికే అందం ఆమె రూపం. నిండు జాబిలిని సైతం చిన్నబుచ్చే సోయగం ఆమె సొంతం. అణకువ, అభినయం కలగలిపిన ఆ అందాల బొమ్మే తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఏలుతున్న తమన్నా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణాన్ని కలిగిన ఈ తార గత 15 ఏళ్లుగా సినీ వినీలాకాశంలో మెరుస్తూనే ఉంది. అవార్డులు, రివార్డులు ఆమె అభినయానికి దాసోహం అయ్యాయి.
కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది తమన్నాభాటియా. బాలీవుడ్ చిత్రం ‘చాంద్ షా రోషన్ చెహ్రా’తో తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ తర్వాత అభిజిత్ సావంత్ ఆల్బమ్‌లోని ‘లఫ్జో మే’ సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత బాలీవుడ్ కాకుండా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనదైన శైలిలో నటించి మెప్పించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది.
తెలుగులో ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన తమన్నా… శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ సినిమాతో ఫేవరేట్ అయిపోయింది. పర్‌ఫెక్ట్ కాలేజ్ గాళ్‌గా, గర్ల్ ఫ్రెండ్‌గా వావ్ అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్నా డ్రెస్సింగ్‌కు అబ్బాయిలు పడిపోయారు. ‘హ్యాపీడేస్’ కమర్షియల్ సక్సెస్‌తో వెనక్కి తిరిగి చూసుకోలేదు తమూ బేబి. 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి సినిమాలతో దూసుకుపోయింది. 2012లో తమన్నా నటించిన నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రచ్చ, ఎందుకంటే ప్రేమంట, కెమెరామెన్ గంగతో రాంబాబు, రెబల్ సినిమాలతో తెలుగునాట క్రేజీ హీరోయిన్ అయిపోయింది. కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ రేంజ్ పొందిన తమన్నా.. అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలతో చాలా బిజీగా మారింది.
ఆ సమయంలో సౌత్ ఇండియాలో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా ఉండటంతో తమన్నాకు బాలీవుడ్ నుంచి ఆఫరొచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ‘హిమ్మత్ వాలా’ సినిమాలో నటించింది. ఈ సినిమా శ్రీదేవి హీరోయిన్‌గా వచ్చిన ‘హిమ్మత్ వాలా’ రీమేక్. అయితే, అందంలో శ్రీదేవిని తలపించినా నటనలో మాత్రం తేలిపోయిందనే విమర్శలు ఎదుర్కొంది. అయినా తమన్నాకు బాలీవుడ్‌లో ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. వీటిలో ‘హమ్ షకల్’, ‘ఎంటర్‌టైన్మెంట్’ చిత్రాలను ఎంచుకున్నా బాక్సాఫీసు దగ్గర అవి కాస్త బోల్తా కొట్టాయి.
కానీ, 2015లో బాహుబలిలో అవంతికగా కనిపించిన తమన్నా.. బాలీవుడ్ ప్రేక్షకులతో వావ్ అనిపించే యాక్టింగ్ చేసింది. అవంతికగా అపురూపమైన, అందమైన అమ్మాయిగా కనిపిస్తూనే కత్తి పట్టి వారియర్‌గా మెప్పించింది. కానీ, తర్వాత వచ్చిన నా నువ్వే, నెక్స్ట్ ఏంటి? చిత్రాలు నిరాశపరిచినా F2 మూవీతో హిట్ అందుకుంది తమన్నా. అనంతరం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో కమర్షియల్ హిట్ సాధించిన తమన్నా ఈ చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఫైనల్‌గా 15 ఏళ్లలో దాదాపు 70 చిత్రాలు చేసి ‘దటీజ్ తమన్నా’ అనిపించుకున్న మిల్కీ బ్యూటీ ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది.
Tags : Tamanna, 15 Years Industry For Tamanna