రాజభవన్‌లో మరోసారి కరోనా కలకలం..

by  |   ( Updated:2020-07-29 21:01:53.0  )
రాజభవన్‌లో మరోసారి కరోనా కలకలం..
X

దిశ, వెబ్ డెస్క్ :
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో మరోమారు కరోనా కలకలం రేపింది. అందులో పనిచేస్తున్న 15 మంది భద్రతా సిబ్బంది కరోనా బారిన పడ్డారు. విషయం తెలియడంతో వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు పాత వారి స్థానంలో మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని మార్చారు. అనంతరం రాజ్‌భవన్‌ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బందికి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story