అక్కడ 15 లక్షలు దాటిన కరోనా మరణాలు..

by vinod kumar |
corona
X

దిశ వెబ్ డెస్క్ ; అగ్రరాజ్యంలో కరోనా విలయతాండవం మనకు తెలిసిందే. రోజుకు వేల మంది కరోనా బారిన పడి అల్లాడి పోయారు. ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గినా, రానున్న పెను ముప్పు పై మాత్రం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లాటిన్ అమెరికాలో దాదాపు 15 లక్షల పైనే మరణించినట్టు నివేదికలు చెబుతున్నాయి. నాలుగున్నర కోట్ల మందికి కరోనా మహమ్మారి సోకిందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ప్రపంచంలోనే ఎక్కువగా అమెరికాలో మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ 7,32,476 అమెరికాలో చనిపోగా , బ్రెజిల్ లో ఈ సంఖ్య ఆరు లక్షలుగా ఉంది.

ఈ రెండు దేశాలతో పాటు కొలంబియా, అర్జెంటినా, మెక్సికో, పెరూ లలో కూడా అధిక సంఖ్యలోనే మరణాలు నమోదు అయ్యాయి. ప్రపంచం లో దాదాపు 24 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో నాలుగు లక్షల ఎనబై ఐదు వేల మంది మరణించారు. పాజిటివ్ కేసుల నమోదులో భారత్ రెండో స్థానంలో ఉండగా అమెరికా మెదటి స్థానంలో ఉంది.

Advertisement

Next Story