- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిద్దిపేట, గజ్వేల్‌లో 144 సెక్షన్ : సీపీ జోయల్ డేవిస్

దిశ, సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీ, గజ్వేల్ 12వ వార్డు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 144 సీఆర్‌పీసీ సెక్షన్ అమలు చేయనున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 సాయంత్రం 7 గంటల నుండి మే నెల 1ఉదయం 7 గంటల వరకు ఎవరూ బయట గుంపులుగా సంచరించవద్దని ఆదేశించారు.
ఎన్నికల కేంద్రాల వద్ద, చుట్టుపక్కల పట్టణాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పార్టీ జెండాలు, గుర్తులు ప్ల కార్డ్స్ ప్రదర్శించవద్దన్నారు. మైకులు లౌడ్ స్పీకర్లు వాడరాదని, పాటలు ఉపన్యాసాలు ఇవ్వకూడదన్నారు. విజయోత్సవ ర్యాలీలు సభలు, సమావేశాలు నిర్వహించకూడదని.. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటివి నిషేధం అని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లింఘించిన వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం, కొవిడ్ రూల్స్ బ్రేక్ కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ తెలిపారు.