Kishan Reddy: తెలంగాణకు పీఎమ్ కే‌ర్ ద్వారా 1405 వెంటిలేటర్లు: కిషన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-05-21 02:52:41.0  )
Kishanreddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం పీఎమ్ కేర్ ద్వారా 1405 వెంటిలేటర్‎లను అందించిందని కేంద్ర హోంశాఖ సహాయ శాఖ కిషన్ రెడ్డి ప్రకటించారు. వీటన్నింటినీ రాష్ట్రంలోని 46 ప్రభుత్వ ఆసుపత్రులకు అందించామని వివరించారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గత 8 నెలల క్రితం వరకు 1900 వెంటిలేటర్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో 51,000 వెంటిలేటర్లు పీఎమ్ కేర్ నిధుల ద్వారా ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, ఆక్సిజన్ సీలిండర్లు, ఇంజెక్షన్లు, వాక్సిన్ లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మస్కులు, పేదలకు ఉచిత బియ్యం, వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed