వయసు 14..ఎత్తు 7.25 అడుగులు

by Shyam |
వయసు 14..ఎత్తు 7.25 అడుగులు
X

దిశ, వెబ్ డెస్క్: మనిషి తన జీవితంలో ఎత్తుకు ఎదిగినా ఎదగపోయినా కనీసం ‘ఎత్తుగా’ అయినా ఉండాలని కోరుకుంటాడు. ప్రధానంగా పురుషులు ‘హైట్’ను ఇష్టపడుతుంటారు. తమల్ని ఆజానుబాహుడని, ఆరుడగుల బుల్లెట్ అంటూ మెచ్చుకోవాలని ఇష్టపడుతుంటారు. అందుకే ఎత్తు పెరగడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. అయితే, ఓ పద్నాలుగేళ్ల పిల్లోడు మాత్రం ఏం చేయకుండానే తన వయసుకు మించి ఎదిగిపోయాడు. 7.25 అడుగుల పొడవు పెరిగినా ఆ బాలుడు త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్నాడు.

చైనా, సిచ్యువాన్ ప్రావిన్స్, లేషన్ సిటీకి చెందిన జియు అనే కుర్రాడ్ని చూస్తే అయ్ బాబోయ్ ఎంత పొడగో..అని అనుకోవాల్సిందే. టాలెస్ట్ టీనేజర్‌గా జియు ప్రపంచ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. ‘మా స్కూల్లో నేనే అందరికన్నా పొడగరిని. చాలా మంది విద్యార్థులు నేను వాళ్ల కన్నా సీనియర్ జనరేషన్‌కు చెందిన వాడినని భావిస్తుంటారు. వాళ్లు అలా అనుకోవడం నాకు కాస్త బాధ కలిగించినా.. నేను దాన్ని అడ్వంటేజ్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇటీవలే నా హైట్‌ను గుర్తించాలని గిన్నిస్ నిర్వాహకులకు అప్లయ్ చేశాను.’ అని జియు తెలిపాడు.

జియు ఇటీవలే తన 14వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగానే గిన్నిస్ నిర్వాహకులు కూడా తన లేషన్ సిటీకి వచ్చి జియు కొలతలు తీసుకున్నారు. 13-18 ఏళ్ల వయసకు సంబంధించిన ‘హైట్’విభాగంలో ప్రపంచలోనే పొడవైన టీనేజర్‌గా జియును అధికారికంగా వచ్చే నెలలో ప్రకటించే అవకాశాలున్నాయి. గత రికార్డు అమెరికాకు చెందిన కెవిన్ బ్రాడ్‌ఫోర్డ్ పేరిట ఉంది. అతడు తన 16 ఏళ్ల వయసులో 7.1 ఇంచుల హైట్ ఉండేవాడు. 2015లొ టాలెస్ట్ టీనేజర్‌గా బ్రాడ్ ఫోర్ట్ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును మరికొన్ని రోజుల్లో జియు బ్రేక్ చేయనున్నాడు.

Advertisement

Next Story