ఏపీ ప్రజా ప్రతినిధులకు సుప్రీం షాక్

by Anukaran |
ఏపీ ప్రజా ప్రతినిధులకు సుప్రీం షాక్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీకి చెందిన 132 మంది వివిధ పార్టీల ప్రజాప్రతినిధులపై 132 పెండింగ్ కేసులున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. హైకోర్టు తక్షణమే విచారణ ప్రారంభించాలని సోమవారం ఆదేశించింది. ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.

సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా కార్యాచరణ ప్రణాళికను సమర్పించారు. విజయవాడలోని ప్రత్యేక కోర్టులో ప్రజాప్రతినిధులపై మొత్తం 132 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 10 సెషన్స్ కోర్టులో ఉండగా మరో 122 కేసులు మేజిస్ట్రేట్ స్థాయి కోర్టులో ఉన్నట్లు వెల్లడించారు.

దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఒక మేజిస్ట్రేట్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టులను విశాఖ, కడపలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను ప్రాధాన్యతా క్రమంలో లేదా సాధారణ విచారణా? అనే అంశంపై ఏపీ హైకోర్టు స్పష్టత కోరింది. దేశవ్యాప్తంగా 4,859 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

Next Story