- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందాల చందమామ..అద్భుత సినీ ప్రయాణం
కాజల్ అగర్వాల్..అందాల చందమామ. వెండితెరపై 13 ఏళ్లుగా రాజసాన్ని ప్రదర్శిస్తోన్న యువరాణి. క్యూట్ నెస్‌తో మురిపించి.. హాట్‌నెస్‌తో మైమరపించి..కామెడీ టైమింగ్‌తోనూ మెప్పించే ఈ గ్లామర్ ఐకాన్..ఎమోషనల్ సీన్స్‌తో ఏడిపించనూ గలదు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను దాదాపు పదేళ్లు మకుటం లేని మహారాణిలా ఏలిన కాజల్… వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తను కాదంటేనే ఒక సినిమా ఛాన్స్ మరో హీరోయిన్ వద్దకు చేరేది అంటే అతిశయోక్తి కాదు.
స్టార్ హీరోలు, చిన్న హీరోలు.. ఫ్లాప్ హీరోలు, బ్లాక్ బస్టర్ హీరోలు..ఇలా లెక్కలతో సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే చాలు సినిమా కమిట్ అయిపోయేది కాజల్. అందుకే ఆమె అందరి హీరోల ఫేవరెట్ అయిపోయింది. కొంత మంది హీరోలకు గోల్డెన్ లెగ్‌లా కూడా మారింది. కాజల్‌తో సినిమా అంటే ‘పక్కా హిట్’ అనుకునే స్థాయి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. సినిమా అంటే పాషన్‌తో ఉండే కాజల్… బిజీ షెడ్యూల్స్‌తో నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు కూడా ఉన్నాయ్. స్టార్ హీరోయిన స్టేటస్ సొంతమైనా నిర్మాతలకు, దర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా..తన పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చే డెడికేషన్ తనది. అందుకే అన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుంది ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ. హిందీ సినిమాల్లోను తళుక్కుమన్న కాజల్..సౌత్ ఇండస్ట్రీపైనే ప్రధానంగా దృష్టిసారించింది. తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత చందమామ సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అటు గ్లామర్, ఇటు ట్రెడిషనల్ లుక్స్‌లో ఇట్టే సెట్ అయిపోయే కాజల్..ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ సినిమాలో తన నటనకు ఇండస్ట్రీ ఫిదా అయింది. అందుకే వరుస ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయ్. మగధీరలో యువరాణిగా కనిపించినా..మిస్టర్ పర్‌ఫెక్ట్‌లో పక్కింటి అమ్మాయిలా సందడి చేసినా… టెంపర్, దడ లాంటి సినిమాల్లో తన హాట్‌నెస్‌తో కుర్రకారుకు గిలిగింతలు పెట్టినా..డార్లింగ్‌లో కామెడీ, యాక్టింగ్‌తో అదరగొట్టినా కాజల్‌కే చెల్లుతుంది.
అందుకే ఆమె అభిమానులు అంటారు..‘దేవుడు తీర్చిదిద్దిన అద్భుతం నువ్వు..నీ అందాన్ని పొగిడేందుకు, నీ ప్రతిభను ప్రశంసించేందుకు మాటలు లేవని..ఉన్నా చాలవని..’ అందుకే మేడమ్ టుస్సాడ్స్ తన ప్రతిభను గుర్తించింది. మాటలు లేవు సరే.. నీ మైనపు బొమ్మనే మా మ్యూజియంలో పెట్టుకుంటామంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి తొలిసారి ఒక హీరోయిన్ విగ్రహం మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన ఘనత సొంతం చేసుకుంది కాజల్. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న కాజల్‌కు బెస్ట్ విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్.