తెలంగాణలో కొత్తగా 1,273 కరోనా కేసులు

by Anukaran |
తెలంగాణలో కొత్తగా 1,273 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల రోజూ విపరీతంగా పెరుగుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,30,274 కు చేరింది. కొత్తగా వైరస్ బారినపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,303కు పెరిగింది. తాజాగా 1,708 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం రికవరీల సంఖ్య 2,09,034 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,937 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

Next Story