- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం
దిశ ఏపీ బ్యూరో : విజయవాడ నగరం మధ్యలో ఉన్న స్వరాజ్ మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్)లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విగ్రహ శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారని కలెక్టర్ ఏ ఎండీ ఇంతియాజ్ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో- ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శంకుస్థాపనలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, మెమోరియల్ హాలు, మెమోరియల్ లైబ్రరీ, స్టడీ సెంటర్, ల్యాండ్ స్కేపింగ్, గార్డెన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా, తెలంగాణలో ఇలాంటి విగ్రహాన్ని పెట్టేందుకు సీఎం కేసీఆర్ కూడా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.