- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన నారాయణఖేడ్‌లో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్‌గిద్ద మండలం ఇరాక్ పల్లికి చెందిన మారుతి రెడ్డి.. నారాయణఖేడ్‌లో బ్యాటరీల దుకాణం నిర్వహిస్తూ రెహమాన్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. గత నెల 21న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లగా, లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం మారుతి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఇంటి యజమాని ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. దీంతో వెంటనే నారాయణఖేడ్‌కు బయల్దేరి వచ్చిన మారుతికి.. ఇంట్లోని బీరువాలో 12 తులాల బంగారం కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Tags: gold theft, narayanakhed, crime news, ts