కేరళలో 1169 పాజిటివ్ కేసులు..

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మొట్ట మొదటి కరోనా కేసు నమోదు అయిన కేరళ రాష్ట్రంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్నది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా కేరళలో 1169 కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,342 కు చేరింది. ఇప్పటివరకూ వైరస్ బారిన పడి 14,467 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Advertisement