- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
11 ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. యంగెస్ట్ మదర్‌గా రికార్డ్!
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే కొన్ని సంఘటనలు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తుంటాయి. ఇది ఎలా సాధ్యం? అనే అనుమానాలను రేకెత్తిస్తుంటాయి. అచ్చం అలాంటి ఇన్సిడెంట్ ఒకటి యూకేలో వెలుగుచూసింది. 10 ఏళ్లకే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన ఓ బాలిక యంగెస్ట్ మదర్‌గా రికార్డ్ సృష్టించింది.
యూకేలోని స్థానిక వార్తాపత్రికల సమాచారం మేరకు.. బాలిక పేరెంట్స్‌కు కూడా ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు తెలియకపోగా, ఈ విషయంతో తాము షాక్ తిన్నామని వారు తెలపడం విశేషం. ప్రస్తుతం తల్లీ, బిడ్డ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నట్టు సమాచారం. అయితే 11 ఏళ్ల బాలికకు గర్భం ఎలా వచ్చింది? తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా జరిగింది? అనే విషయం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై స్పందించిన డాక్టర్ కారల్ కూపర్.. యంగ్ మదర్ తనే అన్న విషయం తెలియదన్నారు. కానీ అమ్మాయిలు 8-14 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా యుక్తవయసులోకి వస్తారని, కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పారు.
యూకేలో యంగెస్ట్ మదర్..
పెరూ దేశానికి చెందిన ఈ అమ్మాయి 11ఏళ్లకే తల్లి కాగా చరిత్రలో యంగెస్ట్ మదర్ రికార్డు మాత్రం మరొకరి పేరున ఉంది. 1939లోనే పెరూకు చెందిన లినా మెడీనా 6 ఏళ్ల వయసులో శిశువుకు జన్మనిచ్చింది. కాగా గడిచిన 30 ఏళ్లలో ఇలాంటివి 4 కేసులు నమోదైనట్టు డాక్టర్ వెల్లడించారు. ఇక యూకేలోనే సొంత సోదరుడు అత్యాచారం చేయడంతో ట్రెస్సా అనే అమ్మాయికి 12ఏళ్లకే బిడ్డ పుట్టింది.
దాంతో తన పేరు మీదనే యంగెస్ట్ మదర్ రికార్డ్ ఉండగా.. ప్రస్తుతానికి యూకే యంగెస్ట్ మదర్‌గా పెరూ గర్ల్ నిలిచింది.