తమిళనాడులో భారీ పేలుడు.. 11మంది మృతి

by Sumithra |   ( Updated:2021-02-12 06:18:48.0  )
తమిళనాడులో భారీ పేలుడు.. 11మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : బాణాసంచా పేలిన ఘటనలో 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విరుద్‌నగర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. మందుగుండు సామగ్రి తయారీలో కార్మికులు నిమగ్నం అవ్వగా, ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొత్తం ధ్వంసమైంది. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా, పేలుడు ఎలా సంభంవించిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీల్లో గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ప్రమాదాలు తరచూ రిపీట్ అవుతున్నాయని చుట్టుపక్కల ప్రజలు ఆరోపిస్తున్నారు.

తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు..
Advertisement

Next Story