నీరు తాగి 11 మందికి అస్వస్థత

by Anukaran |   ( Updated:2020-11-09 02:07:32.0  )
నీరు తాగి 11 మందికి అస్వస్థత
X

దిశ, వెబ్‎డెస్క్: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమావత్ మేగ్యా కుటుంబం తాగిన మంచినీటితోనే అస్వస్థతకు గురైనట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాసేపట్లో వీరికి చేసిన టెస్ట్ ఫలితాలు రావచ్చని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story