ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

by vinod kumar |
ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై ఈరోజు తెల్లవారుజామున ఓ ట్రక్కు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు.

షెన్యాంగ్-హైకో ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రక్ డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం ప్యాసింజర్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story