- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్‌లో గ్లూకోజ్ నీళ్లు.. పది మంది కొవిడ్ రోగులు మృతి
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో ఆక్సిజన్, వ్యాక్సి్న్లు అందుబాటులో లేక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని అదునుగా తీసుకుని కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఓవైపు ప్రాణాలు పోతుంటే మరోవైపు డబ్బులు సంపాదనే ధ్యేయంగా వీళ్లు పనిచేస్తున్నారు. వ్యాక్సిన్లకు మార్కెట్లో కొరత ఉండటంతో నకిలీ టీకాలు తయారు చేసి విక్రయిస్తున్నారు.
తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ముఠా గుట్టురట్టయ్యింది. అంతకుముందు ఈ ముఠా వ్యాక్సిన్లలో గ్లూకోజ్ నీళ్లు నింపి బహిరంగ మార్కెట్లో విక్రయించారు. అది తీసుకున్న పది మంది కరోనా రోగులు మృతి చెందారు. ముందుగా వీరు ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ కేంద్రాల దగ్గర రోగి బంధువులను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. రెమిడెసివిర్ పేరుతో గ్లూకోజ్ నింపిన 1200 బాటిళ్లను సైతం విక్రయించినట్లు తేలింది.ఈ దందా మొత్తం గుజరాత్ కేంద్రంగా నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇకమీదట ఎవరైనా ఇలాంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.