- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ ‘బామ్మలు’
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కారణంగా ఇప్పట్లో స్కూళ్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు బోధిస్తున్నాయి. ఇష్టంతో కొందరు, కష్టంగా ఇంకొందరు.. తప్పక మరికొందరు విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బామ్మలు కూడా ఈ తరం విద్యార్థులతో పోటీపడుతున్నారు. అందుకోసం డిజిటల్ క్లాసులు వింటూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఓ రెండు, మూడు రోజులు స్కూల్‌కు సెలవులు వచ్చాక, ఆ తర్వాతి రోజు పిల్లల్ని బడికి పంపించాలంటే.. ఎంతో మారాం చేస్తారు. అలాంటిది.. ఎన్నో సంవత్సరాల తర్వాత చదువుకోవాలనుకోవడం, అందుకోసం పట్టుబట్టి మరీ స్కూల్‌కు వెళ్లిన 106 ఏళ్ల భగీరథి అమ్మ గురించి తెలిసే ఉంటుంది. కేరళ, కొల్లాంకు చెందిన ఈ బామ్మ క్లాసులో కూర్చుని పాఠాలు విని.. నాలుగో తరగతి పూర్తి చేసింది. నేర్చుకునేందుకు ‘వయసు’ అడ్డంకి కాదని నిరూపించింది. కేరళకు చెందిన మరో బామ్మ.. కాత్యాయని (98) కూడా అదే నిరూపించింది. కేరళ స్టేట్ లిటరసీ మిషన్స్ ఎగ్జామినేషన్ పరీక్షల్లో నూటికి 98 మార్కులు తెచ్చుకుని టాపర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ బామ్మల చదువుకు లాక్‌డౌన్ అడ్డుకట్ట వేయాలని చూసింది. కానీ, విధినే మార్చిన వీళ్లకు కంప్యూటర్ నేర్చుకోవడం ఓ లెక్కా.. అందుకే వాళ్లు ‘డిజిటల్’ బాట పట్టారు.
బ్లాక్‌బోర్డ్స్ బదులు కంప్యూటర్ తెరలపై క్లాసులు వింటున్న బామ్మలు.. ల్యాపీలు, స్మార్ట్ ఫోన్ల గురించి కూడా నేర్చుకుంటున్నారు. కాత్యాయని అమ్మ.. తన సమయన్నంతా ల్యాప్‌టాప్ ముందు గడిపేస్తుంది. స్టడీ మెటీరియల్ చదువుతూ.. ఆన్‌లైన్ క్లాసుల వీడియోలు చూస్తూ.. తన చదువును కొనసాగిస్తోంది. ‘అక్షరం’ అనే యూట్యూబ్ చానల్‌లో లిటరసీ మిషన్ అందించే ‘ప్రీ రికార్డెడ్ క్లాస్ రూమ్ వీడియో’లు వింటోంది. ఈ ఇద్దరు బామ్మలు ప్రస్తుతం ‘ఏడో తరగతి ఈక్వలెన్సీ కోర్సు’ చేస్తున్నారు. ఇది 8 నెలల కోర్సు. ఇందులో పాస్ అయితే.. ‘క్లాస్ -10 ఈక్వలెన్సీ కోర్సు’కు అర్హత పొందుతారు. బామ్మలకు పదో తరగతిలో పాస్ కావాలన్నదే తమ చిరకాల కోరిక.. ఈ లెక్కన మరో ఏడాదిన్నరలో వాళ్ల కోరిక నెరవేరవచ్చు. అయితే, ఉమెన్ ఎంపవర్‌మెంట్‌లో భాగంగా.. భగీరథి అమ్మకు గతేడాది ‘నారీ శక్తి’ పురస్కారం కూడా అందించారు.
‘కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి’ అన్న కలాం మాటలకు అక్షర రూపంగా ఈ బామ్మలు కనిపిస్తున్నారు. వాళ్ల కలల్ని నిజం చేసుకోవడానికి.. కరోనా కాలంలోనూ వచ్చిన అడ్డంకుల్ని దాటారు. డిజిటల్ వైపు అడుగులు వేశారు. ఆన్‌లైన్ క్లాసులు వింటూ.. ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.