104 ఏళ్ల అవ్వకు అక్షరాస్యత పరీక్షలో 89/100 మార్కులు

by Shyam |   ( Updated:2021-11-15 07:26:30.0  )
Kuttiyamma
X

దిశ, వెబ్‌డెస్క్ : మనస్ఫూర్తిగా మనం ఏదైన కోరుకుని ప్రయత్నిస్తే సాధించడం తేలికే. ఈ ఆదర్శమైన కోరికను కేరళకు చెందిన ఒక మహిళ సాకారం చేసుకుంది. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని రుజువు చేస్తూ, ఇటీవల నిర్వహించిన కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ పరీక్షలో 100కి 89 స్కోర్ చేసింది. శుక్రవారం కేరళ విద్యా మంత్రి వాసుదేవన్ శివన్‌కుట్టి తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో నవ్వుతున్న కుట్టియమ్మ ఫొటోను పోస్ట్ చేసి ఇలా రాసుకోచ్చారు.

“కొట్టాయంకు చెందిన 104 ఏళ్ల కుట్టియమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ పరీక్షలో 89/100 స్కోర్ సాధించింది. జ్ఞాన ప్రపంచంలోకి ప్రవేశించడానికి వయస్సు అడ్డంకి కాదు. అత్యంత గౌరవం, ప్రేమతో నేను కుట్టియమ్మను, అలాగే కొత్తగా ఉత్తీర్ణులైన వారందరకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని రాశాడు. ఈ వార్త వైరల్ అయిన తర్వాత కుట్టియమ్మ స్థానికంగా స్టార్‌ అయిపోయింది. సోషల్ మీడియా కూడా ఆమెపై ప్రేమను కురిపించింది. “కుట్టియమ్మ పట్టుదలకు హ్యాట్స్‌ప్ అని.. ఇది ఖచ్చితంగా ఇతరులకు స్ఫూర్తినిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed