- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
1000 కేసులకు తబ్లిఘీ సదస్సుతో లింక్
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి టాపిక్ లో తబ్లిఘీ సదస్సు ప్రధానంగా మారింది. ఈ సదస్సు ద్వారా వ్యాపించిన కరోనా కేసుల సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో నమోదైన సుమారు మూడు వేల కేసుల్లో 1000 మంది బాధితులకు ఈ సదస్సుతో సంబంధం ఉన్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సదస్సుతో లింక్ ఉన్న 1,023 మంది కరోనా బాధితులను 17 రాష్ట్రాల్లో గుర్తించినట్టు హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరులకు తెలిపారు. అంటే దేశంలోని మొత్తం కేసులో 30 శాతం కేసులు తబ్లిఘీ జమాత్ సదస్సు తో లింక్ ఉన్నవే. ఈ సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్ట్ అయిన వారినీ ముమ్మరంగా గాలిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు సుమారు 22 వేల మందిని గుర్తించి క్వారంటైన్ లోకి పంపినట్టు కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు.
వయసుల వారీగా కరోనా సోకిన వారి వివరాలు:
విలేకరుల సమావేశంలో లవ్ అగర్వాల్ వెల్లడించిన వివరాల ప్రకారం…
దేశంలోని మొత్తం కరోనా బాధితుల్లో 20 ఏళ్ల లోపు వారు 90 శాతం మంది ఉన్నారు. 21 నుంచి 40 ఏళ్ల లోపు వారు 47 శాతం మంది. 41 నుంచి 60 ఏళ్ల వయసున్న కరోనా బాధితులు 33 శాతం మంది ఉన్నారు. 60 ఏళ్ళ పైబడ్డ కరుణ బాధితులు 17 శాతం మంది అని ఆయన వెల్లడించారు.
కట్టుదిట్టంగా కట్టడి చర్యలు:
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా బాధితులను గుర్తించడంలో ఏ ఒక్క పొరపాటు జరిగినా అదొక సవాలుగా మారే ప్రమాదముందని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ అగర్వాల్ తెలిపారు. అందుకే అనుమానితుల వెతుకులాటకు ముగింపు లేదు. కరోనా అంతమయ్యేవరకు ఆ చర్య కొనసాగుతూనే ఉంటుందని వివరించారు. కరోనా కేసులు పెరుగుతున్నట్టే.. అందుకు అనుగుణంగా.. దాన్ని అరికట్టే చర్యలు ఉన్నాయని తెలిపారు. రెండు.. మూడు వారాల క్రితం దేశంలో 30 నుంచి 40 ల్యాబ్స్ మాత్రమే ఉండేవని.. ఇప్పుడు 130కి మించి ప్రభుత్వ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పారు. అదీగాక, సమస్య తీవ్రతను అంచనా వేసి ప్రైవేట్ ల్యాబ్ ల సేవలనూ వినియోగించుకుంటున్నట్టు వివరించారు. అలాగే వైరస్ వ్యాప్తి చెందుతున్న వేగానికి తగ్గట్టు పరీక్షలను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. వారం పది రోజుల క్రితం రోజుకు నాలుగు నుంచి ఐదు వేల టెస్టులు నిర్వహించేవారు.. ఇప్పుడు ఎనిమిది నుంచి పది వేల టెస్టులు జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే.. రక్షణ పరికరాలను ఇతర దేశాల నుంచి సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
Tags: Coronavirus, Tablighi, control, cases, link, tests, labs