- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LIC ఐపీఓ ఇష్యూ పరిమాణంలో పాలసీదారులకు 10% కేటాయింపు
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు రానున్న దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఇష్యూ పరిమాణంలో 10 శాతం వరకు కంపెనీ పాలసీదారులకు కేటాయించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎల్ఐసీలోని హోల్డింగ్‌లో కొంత భాగన్ని ఐపీఓ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి అవసరమైన మార్పులు, నియంత్రణ సంస్థ ఆమోదం తర్వాత ఐపీఓకు వస్తుందని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. 2021-22, ఆర్థిక బిల్లులో ఎల్ఐసీ జీవిత బీమా పాలసీదారులకు అనుకూలంగా ఇష్యూ పరిమాణంలో 10 శాతం వరకు పోటీ ప్రాతిపదికన రిజర్వేషన్లను ఉంచాలని ప్రతిపాదించింది.
ప్రభుత్వం మెజారిటీ వాటాదారుగా ఉంటుందని, పాలసీదారులను పరిరక్షించే నిర్వహణ నియంత్రణను కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతేడాదే ఎల్ఐసీ ఐపీఓను చేపట్టాలని ప్రభుత్వ ప్రణాళిక వేసినప్పటికీ, కరోనా వైరస్ కారణంగా మార్కెట్ ప్రతికూలంగా ఉండటంతో వాయిదా వేసింది. ఈ నెల 1న ప్రవేశపెట్టిన 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఎల్ఐసీ ఐపీఓను తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికి అవసరమైన సరవరణలను తీసుకొస్తామని ఆమె స్పష్టం చేశారు.