నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

by Jakkula Mamatha |
నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
X

దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణావకాశం. ఇండియన్ నేవీలో అగ్నివీర్(మెట్రిక్ రిక్రూట్), అగ్నివీర్(SSR), అగ్నివీర్(SSR మెడికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు రేపటి(మార్చి 29) నుంచి వచ్చే నెల(ఏప్రిల్) 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు INS చిల్కాలో (02/2025-సెప్టెంబర్‌, 01/2026- ఫిబ్రవరి అండ్ 02/2026-జులై బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ ను సందర్శించండి. అప్లికేషన్‌కు రూ.550 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అగ్నివీర్(MR)కు పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. అగ్నివీర్(SSR)కు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. అగ్నివీర్(SSR మెడికల్)కు ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. ఇంటర్‌లో కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(CBT), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.



Next Story

Most Viewed