- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఐపీఎల్-18’ తొలి వారం మ్యాచ్‌లకు రికార్డు వ్యూయర్‌షిప్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18 మ్యాచ్‌లకు అభిమానులు స్టేడియాలకు క్యూకడుతున్నారు. స్టేడియాలకు రాలేనివారు డిజిటిల్ ప్లాట్‌ఫాం, టీవీల్లో వీక్షిస్తున్నారు. జియోహాట్‌స్టార్, స్టార్ సోర్ట్స్ నెట్‌వర్క్ చానెల్‌లో మ్యాచ్‌లు లైవ్‌స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. తొలి వారంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు రికార్డు వ్యూయర్‌షిప్ దక్కింది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లలో కలిపి మొత్తం 28.7 కోట్ల మంది వీక్షించగా.. 4,956 కోట్ల నిమిషాల వాచ్‌టైం నమోదైంది. తొలి మూడు మ్యాచ్‌లకు జియో హాట్‌స్టార్‌లో గత సీజన్‌తో పోలిస్తే 40 శాతం ఎక్కువ వ్యూయర్‌షిప్ వచ్చింది.3.4 కోట్ల మంది డిజిటల్ ప్లాట్‌ఫాంలో మ్యాచ్‌లను వీక్షించారు. 137 కోట్ల వ్యూస్ రాగా.. 2,186 కోట్ల నిమిషాలపాటు వీక్షించారు. ఇక, బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌సీ) నివేదిక ప్రకారం.. టీవీ వ్యూయర్‌షిప్‌లో ఈ సీజన్ కొత్త రికార్డులను నమోదు చేసింది. 25.3 కోట్ల మంది వీక్షించగా.. 2,770 కోట్ల నిమిషాలు నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ. తొలి మూడు మ్యాచ్‌లకు సగటు టీవీ రేటింగ్ 39 శాతం పెరిగింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో 12 భాషల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. స్పోర్ట్స్, జియోస్టార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ.. ఐపీఎల్ అసమానమైన ప్రజాధరణను ఈ రికార్డు వ్యూయర్‌షిప్ తెలియజేస్తుందని చెప్పారు. జియోస్టార్ విస్తృతమైన ప్లాట్‌ఫాం, అభిమానుల కోసం వినూత్న వ్యూహాలు వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. 4,956 కోట్ల నిమిషాల వాచ్‌టైంతో ఈ సీజన్ అద్భుతంగా మొదలైందని తెలిపారు.