వరంగల్‌లో పది పాజిటివ్ కేసులు నమోదు

by Shyam |
వరంగల్‌లో పది పాజిటివ్ కేసులు నమోదు
X

దిశ, వరంగల్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది రోజూ అంతకంతకూ కేసులు పెరుగుతూ రాష్ట్రంలో విలయతాండం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇవాళ పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో నాలుగు, వరంగల్ రూరల్ జిల్లాలో ఐదు, మహబూబాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారో అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story