- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరిగా ఉంటే చాలు వాటేసుకుంటున్నాడు
సోషల్ మీడియాలో గత నెలలో వైరల్ గా మారిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఫోన్ కాల్ గుర్తుందా? అచ్చం అలాగే ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు వెనుక నుంచి వాటేసుకుంటున్నాడో ఈవ్‌టీజర్.. అకస్మాత్తుగా వ్యక్తి పట్టుకోవడంతో బెంబేలెత్తిపోయే బాధితులు తేరుకునేంతలో ముద్దుల వర్షం కురిపించి, ఒళ్లంతా తడిమేసి వెళ్లిపోతాడు.
గత నెల 25న ఈ ఈవ్ టీజర్ నిర్వాకం సీసీ పుటేజీకి చిక్కింది. బాధితురాలు ఫిర్యాదు చేస్తుంది పట్టుకుందామని పోలీసులు కూడా వేచి చూశారు. అయితే ఆమె ఫిర్యాదు చేయలేదు. పొరపాటును జరిగి ఉంటుందని భావించిన రైల్వే పోలీసులు ఊరుకోగా.. ఇలాంటి ఘటనలు వరుసగా సీసీ పుటేజీల్లో నమోదు కావడంతో పోలీసులు ఆలస్యం చేయలేదు. సీసీ పుటేజ్ సాయంతో అతడిని పట్టుకుని కటకటాల వెనక్కినెట్టారు. దీని వివరాల్లోకి వెళ్తే..
ఆర్థిక రాజధాని ముంబైకి పొట్టకూటికోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాయ్‌జూర్ హబీబర్ ఖాన్ వచ్చాడు. ముంబైలో వడ్రంగిగా పనిచేస్తూ భార్య. బిడ్డలను పోషిస్తున్నాడు. గత నెల 25 నుంచి రైల్వే పాసింగ్ బ్రిడ్జ్ పైన ఒంటరిగా కనిపించే మహిళలను వాటేసుకుని భయాందోళనలకు గురిచేస్తున్నాడు. దీంతో అతని ఆటకట్టించాలని భావించిన పోలీసులు సివిల్ వేషధారణలో కాపుగాసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌పై రైల్వేపోలీసులు ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతనిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేసేందుకు న్యాయపరమైన అవకాశాల కోసం చూస్తున్నారు.