- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లో చీలిక !
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లో చీలిక వచ్చింది. అశ్వత్థామరెడ్డి లేకుండానే టీఎంయూ అధ్యక్షుడు థామస్‌రెడ్డి వర్గం సోమవారం హబ్సిగూడలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా థామస్‌రెడ్డి వర్గం నేతలు.. అశ్వత్థామరెడ్డిని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల బాగోగులను అశ్వత్థామరెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమ్మె తర్వాత ఆయన యూనియన్‌కు దూరంగా ఉంటున్నారని.. కార్మికులను విస్మరించిన వ్యక్తి పదవిలో ఉండటానికి సబబు కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే అశ్వత్థామరెడ్డి తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అశ్వత్థామరెడ్డి బీజేపీ తరపున ఎమ్మెల్సీ పదవి ఆశిస్తూ ఆర్టీసీకి నష్టం చేస్తున్నారని విమర్శించారు.
Next Story