- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటాను.. అప్పటివరకు కొంచెం ఓర్పు, సహనంతో ఉండండి.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత(Producer)గా వ్యవహరిస్తూ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్(NTR) చీప్ గెస్ట్‌గా హాజరయిన సంగతి తెలిసిందే. ఇక ఇక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ఎండల్లో కష్టపెట్టడం ఇష్టం లేదు. ఎండలు తగ్గిన తర్వాత త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను.
చాలా కాలం అయింది కదా పకడ్బందిగా కలుసుకుందాం. కానీ, కొంచెం ఓర్పు, సహనంతో ఉండండి. నందమూరి ఫ్యాన్స్ అంటేనే ఓర్పు, సహనం కాబట్టి ఓపిక పట్టండి. త్వరలోనే అందరినీ కలిసి ముచ్చట్లు పెట్టుకుందాం. కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే ప్లాన్ చేయడానికి, ప్లాన్ చేసినప్పుడు నీట్‌గా ఉండాలి. అందరికీ బాగుండాలి కాబట్టి కొంచెం వ్యవధి ఇవ్వండి’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ కామెంట్స్‌తో స్టేజ్ అంతా కేకలతో దద్దరిల్లిపోయింది.