- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Video Viral:రీల్స్ పిచ్చి.. కదులుతున్న రైలు నుంచి దూకిన అమ్మాయి.. చివరికి!?

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం యువతకు రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరిందనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలను చూస్తూనే ఉన్నాం. రీల్స్ మైకంలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా పోతుంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రీల్స్ కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. యువతి, యువకులు ప్రమాదకరమైన స్టంట్స్ చేసి వ్యూస్, ఫాలోవర్స్ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్(Social Media)గా మారింది.
లక్నోలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయికి రీల్స్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇక రైలు మెట్లపై నిలబడి బయటి దృశ్యాన్ని చూస్తుంది. ఇక ఆ అమ్మాయి రీల్స్ కోసం కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న మొబైల్‌ను తన తోటి ప్రయాణికుడికి ఇచ్చింది. తను వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి కిందకు దిగేటప్పుడు వీడియో తీయాలని అతనికి చెబుతోంది. ఇక నిమిషం కూడా ఆలోచించకుండా ఆమె రైలు వేగంగా వెళుతున్న సమయంలో రైలు ద్వారం వద్దకు వచ్చింది.
కానీ.. వీడియో తీస్తున్న వ్యక్తికి మాత్రం రైలు వేగం చూస్తే భయం వేసింది. ఈ క్రమంలో ఓ పిచ్చి పిల్లా.. రైలు స్పీడ్‌గా వెళ్తుంది.. దూకొద్దూ.. దూకొద్దూ అంటున్న ఆమె వినకుండా దూకేసింది. ఇక వీడియో తీస్తున్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే అలా దూకేసిన ఆ అమ్మాయికి ఏం జరిగిందో అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను @Abhimanyu1305 అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.