- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Nara Lokesh: మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh ).. అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకు వెళ్తున్నారు. ఏపీ వ్యాప్తంగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా తన సొంత నియోజకవర్గ మంగళగిరి పై ( Mangalagiri ) కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే చిరకాల స్వప్నంగా ఉన్న వంద పడకల ఆసుపత్రికి ( 100-bed hospital ) శంకు స్థాపన కూడా చేశారు నారా లోకేష్. ఇవాళ మంగళగిరి నియోజక వర్గంలో ( Mangalagiri ) 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
వేద పండితుల ఆధ్వర్యంలో... ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు టిడిపి నాయకులు, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన టిడిపి కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ వద్ద ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు నారా లోకేష్. అనంతరం తన సొంత నియోజకవర్గం మంగళ గిరి పై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.
మంగళగిరి ప్రజల మనసు గెలుచుకునేందుకు.. చాలా కష్టపడ్డానని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu ) ప్రతిపాదనలు చేశారని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం టిడిపి పార్టీ ( TDP ) తరఫున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh ).
మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్ pic.twitter.com/UbFwB0N6gZ
— BIG TV Breaking News (@bigtvtelugu) April 13, 2025