- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాధారవి ఏకగ్రీవంతో చిన్మయి ఫైర్
చిన్మయి శ్రీపాద.. ఆమె మాట అమృతం, పాట అద్భుతం. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమెకు అభిమానులు కోకొల్లలు. కెరీర్ విజయవంతంగా సాగుతున్న క్రమంలో మీటూ ఉద్యమంతో చిన్మయి ఒడుదొడుకులు ఎదుర్కొంది. సీనియర్ నటుడు రాధారవిపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఒక్క ఆఫర్ కూడా దక్కకుండా చేసింది. పైగా తప్పుడు ఆరోపణలు చేసిందని, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి బహిష్కరించారు. చిన్మయి కోర్టుకు వెళ్లి తిరిగి సభ్యత్వాన్ని పొందింది.
ఇదిలా ఉంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రాధారవికి పోటీగా చిన్మయి నామినేషన్ వేసింది. కానీ, సరైన సమాచారం ఇవ్వలేదంటూ ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాధారవి డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి ముందస్తు సమాచారం లేకుండా నామినేషన్ ఎలా తిరస్కరించారని ప్రశ్నించింది. దేశంలో ఏ ఎన్నికలైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఏళ్ల తరబడి యూనియన్‌లో పనిచేస్తున్న కొందరు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది. యూనియన్‌కు వచ్చే ఫండ్స్‌ను స్వాహా చేస్తున్నారని, వాటి గురించి మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంది.|