- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏడాది తిరగక ముందే కారెక్కారు
దిశ, నిజామాబాద్: పొలిటికల్ లీడర్లు పార్టీలు మారే క్రమంలో చాలా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. అంతటా వారి గురించి ముచ్చట్ల మీద ముచ్చట్లు.. మీడియాలో బ్రేకింగ్స్ ఉత్కంఠను రేపుతాయి. కానీ, చడీచప్పుడు లేకుండా పార్టీని వీడిన నేతలు కనబడటం అరుదు. కానీ, ఓ జడ్పీటీసీ మాత్రం కళ్లు మూసి తెరిచే లోపే కండువా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాక్‌డౌన్ సమయంలో వారు పార్టీ మారుతారన్న ప్రచారం జరగలేదు.. ఊహాగానాలకు మాత్రం ఆనవాళ్లే లేవు.. కానీ, పువ్వులా వికసించి సంవత్సరం తిరగక ముందే కారెక్కారు. నిజామాబాద్ జిల్లా నందిపేట జడ్పీటీసీ ఎర్రం యమున బీజేపీని వీడారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 2019 జిల్లా పరిషత్ ఎన్నికల్లో నిజామాబాద్‌లో బీజేపీ నందిపేట్, రెంజల్ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ఏడాది తిరగక ముందే ఓ జడ్పీటీసీ పార్టీని మారి అధిష్టానానికి షాక్ ఇచ్చారు.