‘జీ5’లో మేజర్ దీప్‌సింగ్ ‘జిద్’

by Shamantha N |
‘జీ5’లో మేజర్ దీప్‌సింగ్ ‘జిద్’
X

దిశ, వెబ్‌డెస్క్ : అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ మేజర్ దీప్ సింగ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సిరీస్ ‘జిద్’. కార్గిల్ వార్‌లో గాయపడి నడుము కింద భాగం పూర్తిగా పక్షవాతంతో పడిపోయినా.. క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించిన వ్యక్తి ఇన్‌స్పిరేషనల్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు డైరెక్టర్ విశాల్ మంగలోర్కర్. సైనిక శిక్షణ, కార్గిల్ యుద్ధం, ఐఐఎం క్రాక్ చేసి కార్పొరేట్ ప్రపంచంలో విజయవంతంగా ఎదిగిన తీరు గురించి సిరీస్‌లో వివరించగా.. లేటెస్ట్‌గా రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 22న రిలీజ్ కానున్న ‘జిద్’ జీ5లో ప్రసారం కానుంది. అమిత్ సద్, సుశాంత్ సింగ్, అమ్రిత పురి ప్రధానపాత్రల్లో వస్తున్న సిరీస్‌ను బే వ్యూ ప్రాజెక్ట్స్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.

Advertisement

Next Story