ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో సలహాదారుడు నియామకం

by srinivas |
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో సలహాదారుడు నియామకం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 30 మందికిపైగా సలహాదారులు ఉండగా.. తాజాగా మ‌రో స‌ల‌హాదారుడిని నియ‌మించింది. మాజీ ఎమ్మెల్యే షేక్ మ‌హ్మ‌ద్ జియాద్దిన్ ని మైనార్టీ వెల్ఫేర్ స‌ల‌హాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు మైనార్టీ వెల్ఫేర్ శాఖ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ గంధం చంద్రుడు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇకపోతే షేక్ మ‌హ్మ‌ద్ జియాద్దిన్ రెండేళ్ల పాటు స‌ల‌హాదారు ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జగన్ కేబినెట్‌లో ఉన్న మంత్రుల కంటే ప్రభుత్వ సలహాదారుల సంఖ్యే అత్యధికంగా ఉందని విమర్శలు ఉన్నాయి. విపక్షాలు సైతం సలహాదారుల నియామకంపై మండిపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో షేక్ మహ్మద్ జియాద్దీన్ ను మైనార్టీ వెల్ఫేర్‌ సలహాదారుడిగా నియమించారు. మరి దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Next Story