దారుణం: మహిళలను వివస్త్రను చేసి దాడి

by Sumithra |   ( Updated:2021-03-15 10:01:36.0  )
దారుణం: మహిళలను వివస్త్రను చేసి దాడి
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి దాడి చేసినందుకు జోగిని శ్యామలపై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు నమోదయ్యింది. గాంధీనగర్‌కు చెందిన తలారి స్రవంతి ఈ నెల 12వ తేదీ శుక్రవారం తల్లి తలారి సంధ్యతో కలిసి మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ దేవాలయానికి దర్శనం కోసం వెళ్లారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు దర్శనం అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆలయానికి జోగిని శ్యామల వచ్చారు. స్రవంతి తల్లి సంధ్యకు శ్యామల పాత పరిచయం కావడంతో వారిద్దరినీ తన అతిథి గదికి శ్యామల ఆహ్వానించింది. దీంతో వారిద్దరూ శ్యామల గదికి వెళ్లారు. ఆ గదిలో అప్పటికే మరో 15 మంది పురుషులు, సహాయకురాలు ఉమతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. సంధ్యను కూడా బలవంతం చేయడంతో వారితో కలిసి మద్యం సేవించింది.

అనంతరం నీవు పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి మమ్ములను పట్టించుకోవడం లేదంటూ సంధ్యను తీవ్ర పదజాలంతో శ్యామల దూర్భాషలాడింది. ఈ సమయంలో తిట్టొద్దంటూ వారు అక్కడి నుంచి బయలు దేరారు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో తలుపులు మూసి తల్లీకూతుళ్లను వివస్త్రలను చేసి దాడిచేశారు. అంతేగాకుండా.. వీడియోలు తీసి వేధించారు. అనంతరం డ్రైవర్ సహాయంతో 13వ తేదీ శనివారం తెల్లవారు జామున 5 గంటలకు హైదరాబాద్ వచ్చారు. ఈ విషయంపై స్రవంతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాదం మెదక్ జిల్లా పాపన్నపేట పీఎస్ పరిధిలో చోటు చేసుకోవడంతో.. ముందుగా పంజాగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అనంతర మెదక్ జిల్లా పాపన్నపేట పీఎస్ కు బదిలీ చేసినట్టుగా ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story