- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీ5 వినియోగదారుల డేటా హ్యాక్?
ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ జీ5 డేటా పూర్తిగా హ్యాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ‘జాన్ విక్’ అనే అలియాస్ పేరుతో కొరియన్ హ్యాకింగ్ గ్రూప్‌నకు చెందిన ఓ వ్యక్తి ఈ పని చేసినట్లు సైబర్ సెక్యూరిటీ న్యూస్ పోర్టల్ క్విక్ సైబర్ పేర్కొంది. జీ5 స్ట్రీమింగ్ సర్వీస్‌కు సంబంధించి 150 జీబీకి పైగా డేటా అతని దగ్గర ఉన్నట్లు సమాచారం. ఇందులో వినియోగదారుల లావాదేవీలు, వాచ్ హిస్టరీ, పాస్‌వర్డులు, వ్యక్తిగత సమాచారంతో పాటు జీ5 సర్వీస్ సోర్స్ కూడా ఉన్నట్లు పోర్టల్ వెల్లడించింది. త్వరలో ఈ డేటాను పబ్లిక్ డొమైన్‌లో బహిరంగ అమ్మకానికి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం గురించి జీ5 యాజమాన్యం స్పందిస్తూ.. ఎలాంటి డేటా హ్యాక్ జరగలేదని వెల్లడించింది. వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది. అంతేకాకుండా ఈ విషయం గురించి విచారణ చేస్తున్నామని తెలిపింది.