- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zareen Khan : వాళ్లకు ముద్దు సీన్లు మాత్రమే కావాలి.. నటి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా : హీరోయిన్ జరీనా ఖాన్‌ను ‘ఓ దర్శకుడు ముద్దు సీన్ తనతో రిహార్సల్ చేయాలి’ అని అడిగిన విషయం తెలిసిందే. 2018లో #MeToo ఉద్యమం సమయంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఆ తర్వాత ఈ మ్యాటర్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇంపార్టెంట్ ఇష్యూస్‌పై ఇలా ఎందుకు జరుగుతుంది? అని జరీనా ప్రశ్నిస్తోంది. ‘మన దేశంలో ఉద్యమాలు చాలా ఎనర్జీ అండ్ ఫోర్స్‌తో దూసుకొస్తాయి.. మీడియా, సోషల్ మీడియాలో అందరూ దాని గురించే మాట్లాడుతారు.
అది #MeToo ఉద్యమమైనా లేదా ఓ అమ్మాయిపై అత్యాచారమైనా ప్రతీ ఒక్కరూ పోస్ట్‌లు పెడుతారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ ఆ సమయంలో ఏదైనా అవార్డ్ ఫంక్షన్ జరిగినా లేక ఏదైనా పండగ వచ్చినా వెంటనే ఈ విషయాన్ని మరిచిపోతారు. ఆ ఈవెంట్‌లో హీరోహీరోయిన్లు ఎలాంటి అవుట్ ఫిట్, జ్యువెల్లరీ ధరించారనే దానిపై కాన్సంట్రేట్ చేస్తారు’ అని అభిప్రాయపడింది. 2018లో #MeToo ఉద్యమం సమయంలో కూడా ఇలాగే జరిగిందన్న జరీనా.. ఆ టైమ్‌లో దీపావళి పండుగ వచ్చిందని.. దీంతో ఏ స్టార్స్ ఎవరి ఇంటికి పార్టీకి వెళ్తున్నారు అనే దానిపైనే ప్రజలు దృష్టిపెట్టారు అని వివరించింది. కానీ ఇలాంటి ముఖ్యమైన, తీవ్రమైన సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.