‘అలా డబ్బు సంపాదించడం తప్పేం కాదు’

by  |
‘అలా డబ్బు సంపాదించడం తప్పేం కాదు’
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ అవసరాల కోసం ఐపీఎల్ ద్వారా డబ్బులు సంపాదించడం తప్పేం కాదని, అది వారికున్న హక్కని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ పీసీబీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడా సంస్థలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయని, బీసీసీఐకి ఉన్న అవకాశాన్ని వాళ్లు వాడుకోవడంతో ఎవరికీ ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ‘ఆటగాళ్లు, ఇతర సిబ్బందితో ఉన్న ఒప్పందాల నేపథ్యంలో క్రికెట్ బోర్డుకు చాలా ఖర్చులు ఉంటాయి. లీగ్స్ నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. ఇదేం అన్యాయంగా సంపాదించేది కాదు. ప్రతి క్రికెట్ బోర్డు లీగ్స్ నిర్వహించేది డబ్బు కోసమే అయినప్పుడు ఐపీఎల్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. స్పాన్సర్లతో కూడా ఒప్పందాలు ఉంటాయి. కాబట్టి ఐపీఎల్ జరగడమే మంచిది’ అని అబ్బాస్ అన్నారు. కాగా, ఐపీఎల్ కోసమే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా వేశారని షోయబ్ అక్తర్ సహా పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆరోపించిన నేపథ్యంలో అబ్బాస్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Next Story

Most Viewed