రాజకీయ కుట్రే – వైవీ సుబ్బారెడ్డి

by srinivas |
రాజకీయ కుట్రే – వైవీ సుబ్బారెడ్డి
X

దిశ, ఏపీబ్యూరో: సప్తగిరి మాసపత్రికపై దుష్ప్రచారంలో రాజకీయ కుట్ర కోణం దాగుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘గతంలో ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారం, తిరుమల కొండల్లో సిలువ పెట్టారని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఎవరు చూస్తున్నారో.. వారి ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. మధ్యలో ఎవరైనా కవర్లు మార్చారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. టీటీడీ కార్యాలయంలో అన్యమత పుస్తకాలు ఎందుకు ఉంటాయి? దేవుడిపైనే నింద వేయాలని చూస్తున్నారని’’ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పిన ఆయన, ఈ ఘటనలో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ సమయంలో ప్రజలను కాపాడమని… సుందరకాండ, వేద పారాయణం టీటీడీ తరపున చేశామని, భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed