చాహల్ కుటుంబంలో కరోనా కలకలం

by Shyam |
చాహల్ కుటుంబంలో కరోనా కలకలం
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. చాహల్ తల్లిదండ్రులకు కరోనా సోకినట్లు అతడి భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. చాహల్ తండ్రి కేకే చాహల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక చాహల్ తల్లి సునీత దేవి కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే ఆమెకు ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ‘గత రెండు నెలలు కష్టంగా గడుస్తున్నది. ఏప్రిల్-మే నెలల్లో నేను ఐపీఎల్ బయోబబుల్‌లో ఉన్న సమయంలో మా అమ్మా, తమ్ముడు కరోనా బారిన పడ్డారు.

కానీ నేను బయటకు రాలేని పరిస్థితి. అక్కడి నుంచే వారికి అవసరమైన సహాయం చేశాను. వారిద్దరూ కరోనా నుంచి కోలుకున్నారు. కానీ మా ఆంటీ, అంకుల్‌ను కరోనా వల్ల కోల్పోయాను. ఇప్పుడు మా అత్తామామలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అత్తమ్మ ఇంటి వద్దే చికిత్స చేయించుకుంటున్నది. మామయ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం మేం ఇంటి వద్ద అని జాగ్రత్తలు తీసుకొని ఉంటున్నాము’ అని ధనశ్రీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నది.

Advertisement

Next Story