- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యువీ.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకో’
దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల (All formats)కూ గుడ్ బై చెప్పిన టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Former cricketer Yuvraj Singh)కు తిరిగి పంజాబ్ (Punjab) తరఫున రంజీ (Ranji) ఆడాలంటూ పిలుపు వచ్చింది. తన రిటైర్మెంట్ (Retirement)ను వెనక్కి తీసుకోవాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (cpa) యువరాజ్ సింగ్‌ను కోరిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
కానీ, ఈ ఆఫర్‌పై యువీ (yuvaraj singh) ఇంకా స్పందించలేదు. అయితే, యువీ తిరిగి దేశవాలీ క్రికెట్‌లో(Indigenous cricket)కి రావాలని భావించినా బీసీసీఐ (BCCI) నిబంధనలు అడ్డుగా ఉండనున్నాయి. యువీ అన్ని ఫార్మాట్లకు రిటైర్మంట్ (Ritairmant)ప్రకటించిన తర్వాత యూఏఈలో జరిగిన ఒక టీ10 ప్రైవేట్ లీగ్‌లో ఆడాడు. ఒక విదేశీ లీగ్ ఆడిన తర్వాత ఏ ఆటగాడికీ బీసీసీఐ (BCCI) ఆధ్వర్యంలో జరిగే మ్యాచ్‌లలో ఆడేందుకు వీలుండదు.
గతంలో ప్రవీణ్ థాంబే (Praveen Thombe) కూడా క్రికెట్ (Cricket)కు గుడ్‌బై చెప్పి యువీ ఆడిన టీ10 లీగ్ (T10 League)లోనే ఆడాడు. అతను తిరిగి ఐపీఎల్‌లోకి రావాలని భావించినప్పుడు కేకేఆర్ (KKR) జట్టు రూ.20 లక్షలకు వేలంలో కొనుక్కుంది. అయితే, అతడు ఐపీఎల్‌లో ఆడటానికి అనర్హుడిగా బీసీసీఐ (BCCI) తేల్చి చెప్పడంతో కేకేఆర్ (KKR)జట్టు అతడిని సీపీఎల్ (cpl)లోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (Trinbago Knight Riders ) జట్టుకు ఎంపిక చేసుకుంది. ఇప్పుడు అదే టీ10 లీగ్‌లో ఆడిన యువీకి బీసీసీఐ అవకాశం ఇచ్చే అవకాశం ఉండదని, ఒక క్రికెటర్ కోసం నిబంధనలు మార్చితే భవిష్యత్‌లో బీసీసీఐకి చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.