షర్మిల మనకోసం వచ్చింది.. అండగా ఉందాం

by Shyam |
YSRTP leader Srinivas Reddy
X

దిశ, నేరేడుచర్ల: ప్రజల సంక్షేమం కోసం దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని వైఎస్ఆర్‌టీపీ హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్‌టీపీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేశారని గుర్తుచేశారు. అంతటి మహనీయుని తనయురాలు వైఎస్ షర్మిల తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అందరి మంచికోసం వచ్చిందని, ఆమెకు అండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

అనంతరం ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బలుసుపాటి రవి, బాపనపల్లి రవీందర్, పిక్కిలి మహేష్, గుంజ ఉపేందర్, ఏలూరి ఏసు, వెంకట్ రెడ్డి, నిమ్మల సాయి, తోటసాయి, వినోద్, పుట్టపాకుల గోపి, చల్లా వీరబాబు, చిలకల వీరబాబు, దొంగల వినోద్, జయంత్, తుపాకుల వీరస్వామి, పిండ్రాతి రామారావు, కారింగుల హరీష్, వెంకన్న, శ్రీనివాసరెడ్డి, చిన్నపరెడ్డి, గోవింద్, బాలరెడ్డి, జయబారతి రెడ్డి, గోవిందమ్మ, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story