- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై నిత్యం విమర్శలు చేసే గ్రంధి శ్రీనివాస్ తాజాగా వ్యక్తిగత జీవితంపై కూడా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం నాడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఆయన పవన్‌పై వ్యక్తిగతంగా ఆరోపణలకు దిగారు. ‘విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు.. కానీ రాజకీయాల్లో అలా కుదరదు. ఇక్కడ విలువలు సిద్ధాంతాలు ఉంటాయి. నిన్న, మొన్నటిదాకా కమ్యూనిస్టు పార్టీలను పవన్ మోసం చేశారు. టీడీపీతో కలిసి విడిపోయి.. బీజేపీతో కలిసి లోపాయికారిగా కింద స్థాయిలో టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు. చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు’ అని శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఇకపోతే 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేయగా.. వైసీపీ తరఫున గ్రంధి శ్రీనివాస్ పోటీచేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.