70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానడు: విజయసాయి

by srinivas |   ( Updated:2020-04-16 01:55:49.0  )
70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానడు: విజయసాయి
X

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ మాధ్యమంగా చెలరేగిపోయారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాను సమయాల్లో వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు ఎలాంటి విమర్శలు చేశారో.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అలాంటి వ్యాఖ్యలే చేసి ఆసక్తి రేపారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో… కష్టకాలంలో ఏపీలో ఉండి, ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన నేత, హైదరాబాద్ లో దాక్కున్నారని ఎద్దేవా చేసిన ఆయన, రేపు ఏ మొహం పెట్టుకుని ఏపీలో అడుగు పెడతారని ప్రశ్నించారు.

ముఖాముఖి తలపడే దమ్ములేక సోషల్ మీడియాలో పిడకలు వేయిస్తున్నాడంటూ విమర్శించారు. 70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానడు అంటూ బాబునుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఏపీ వైపు చూస్తోందన్న ఆయన, యువ ముఖ్యమంత్రి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారని తెలిపారు. దీంతో పచ్చ వైరస్ రక్తంలోకి ఎక్కించుకున్న వాళ్లకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. జగన్‌పైన, వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యనేతల పైన దొంగదాడికి తెగబడుతున్నారని వ్యాఖ్యానించారు. తూ… సిగ్గులేని జన్మలు! అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కరోనా ముట్టడితో ప్రపంచమంతా తల్లడిల్లుతోందంటూ, ఇది మన లాంటి దేశాలకి ఇదో పెద్ద విపత్తని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కష్టకాలంలో అందరూ వ్యాధిని ఎదుర్కొనే పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిని అదనుగా తీసుకున్న ఎల్లో వైరస్ దద్దమ్మలు నీచపు కామెంట్లకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా తమను విమర్శించే వాళ్లవెరూ చట్టం నుండి తప్పించుకోలేరని బెదిరింపులకు దిగారు.

Tags: ysrcp, vijayasai reddy, ysrcp mp, twitter, social media

Advertisement

Next Story

Most Viewed