స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ పరం చేయాలని కోరుతున్నాం : సజ్జల

by srinivas |
Sajjala-Ramakrishna-Reddy
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ పరం చేయించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రా సెంటిమెంట్‍లో ఒక భాగమన్న ఆయన కేంద్రం తలచుకుంటే ప్లాంట్‍ను పునరుద్ధరించవచ్చునని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పకొచ్చారు. నిర్మలా సీతారామన్ వెల్లడించిన దాంట్లో కొత్త పాయింట్ ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

స్టీల్ ప్లాంట్‍తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం తెగేసి చెప్తుంటే పవన కళ్యాణ్ తమను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. కేంద్రం ప్రకటనపై ఎల్లో మీడీయా తప్పుడు రాతలు రాస్తున్నాయని సజ్జల ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్‍పై సీఎం జగన్ ప్రధానికి మరో లేఖ రాశారని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్‍ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జగన్ కోరినట్లు చెప్పుకొచ్చారు.

స్టీల్ ప్లాంట్‍ను లాభాల్లోకి తీసుకురావటానికి సూచనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అఖిలపక్షం, కార్మిక సంఘాలతో కలిసేందుకు సమయం ఇవ్వాలని లేఖలో ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. కృష్ణపట్నంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని పోస్కోను కోరిన విషయాన్ని ప్రస్తావించారు. పోస్కో ప్రతినిధులు కూడా కృష్ణపట్నం వచ్చి పరిశీలించారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story