- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
108 అంబులెన్స్‌లపై వైఎస్ షర్మిల ట్వీట్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 108 వాహనాల పర్యవేక్షణ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని, 420 అంబులెన్సులకు 100 మాత్రమే తిరుగుతున్నాయని వైఎస్సార్‌తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల ట్విట్టర్వేదికగా మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌పాలనలో వాహనాలు సరిగ్గా ఉంటే డ్రైవర్లు ఉండరని, డ్రైవర్లు ఉంటే సరైన వేతనాలు ఇవ్వడంలేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 108 డ్రైవర్లకు 4 నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆపదలో ఉన్నవారు 108 వాహనాలకు కాల్ చేస్తే బాధితుల వద్దకు సమయానికి చేరుకునేందుకు సరైన రోడ్లు లేక డ్రైవర్లు, రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యం అందక ప్రాణాల మీదికి వస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పడికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి జీతాలు చెల్లించి 108 వాహనాలు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.