- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆదివారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో నోటిఫికేషన్స్ ఇవ్వకుండా నిరుద్యోగులను, ఉద్యోగాల నుంచి తొలగించి కాంట్రాక్టు ఉద్యోగులను, భూములు గుంజుకుని రైతులను మోసం చేస్తూ.. వారిని ఆత్మహత్యలు చేసుకొనేలా సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం పక్కనపెట్టి ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన 1600 మంది నర్సులను ఉన్నపళంగా తొలగించి రోడ్డున పడేశారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 52,000 మంది ఉద్యోగులను తీసేశారన్నారు. ఉద్యోగం ఇస్తామని నమ్మించి.. చాకిరీ చేయించుకుని వేతనాలు ఎగ్గొట్టడం, అవసరానికి వాడుకొని రోడ్డున పడేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పించే తీరు ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.